ట్రోలర్స్ కి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన రౌడీ హీరో.. అటువంటి ఫోటో షేర్..!

lakhmi saranya
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుని సొంత టాగ్ని సొంతం చేసుకుంటారు. ఇక అటువంటి వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరో అనే టాక్ ని సొంతం చేసుకున్నాడు విజయ్. ఇక అనంతరం గీతాగోవిందం వంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకులం ముందుకి వచ్చాడు విజయ్ దేవరకొండ. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ హైప్స్ తో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా అంతగా ఆడ లేక పోయింది. ఇక దీంతో బిజీ దేవరకొండ కొంత కాలం సినీ ఇండస్ట్రీకి గ్యాప్ ఇస్తారని చాలామంది భావించారు. కానీ ఆ వెంటనే వరస ప్రాజెక్టులను అనౌన్స్ చేశాడు. అంతేకాదండోయ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో కూడా అర్జునుడి పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాడు.
అయితే ఈ పాత్ర విషయంలో విజయ్ దేవరకొండ కి అనేక ప్రశంసలతో పాటు అనేక ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి. మరి దీంతో విజయ్ వారి అందరికీ ఎలా సమాధానం ఇస్తాడు అని రౌడీ హీరో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. అర్జునుడి రోల్లో విజయ్ ని చూసి కామెంట్స్ చేసిన వారి అందరికీ దిమ్మ తిరిగే విధంగా అదే లుక్ ని తన సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫారం లలో కూడా తాను డీపీగా పెట్టుకున్నాడు. దీంతో మీరెన్ని ట్రోల్స్ చేసుకున్నా నాకు అనవసరం అన్నట్టు ఇదే పెడతా అనే రేంజ్ లో విజయ్ సమాధానమిచ్చాడు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చాకర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: