కల్కికి తలైవా ఫిదా.. అద్భుతం అనేసిన రజినీకాంత్!

Purushottham Vinay
కల్కికి తలైవా ఫిదా.. అద్భుతం అనేసిన రజినీకాంత్!  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని కల్కి 2898ఏడీ మూవీ ఇచ్చింది. రెండు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా 330 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.మొదటి రోజు 190+ కోట్ల వసూళ్లు చేసింది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ఎనౌన్స్ చేసింది. రెండో రోజు కూడా 140+ కోట్లు కలెక్షన్స్ రాబట్టి ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్ అయ్యేలోపు కల్కి మూవీ 500+ కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని తెలుస్తుంది.ఈ మూవీలో అశ్వద్ధామ పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించారు. నిజం చెప్పాలంటే కల్కి 2898ఏడీలో భైరవ పాత్ర కంటే అశ్వద్ధామ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. గత కొన్నేళ్లలో అమితాబ్ బచ్చన్ కి ఈ స్థాయి పాత్ర పడలేదనే మాట బాలీవుడ్ లో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అందుకే నార్త్ ఇండియాలో కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. మైథాలజీ కాన్సెప్ట్ తో ఎడాప్ట్ చేసుకొని ఫ్యూచరిస్టిక్ మూవీగా నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ మూవీని అద్భుతంగా ఆవిష్కరించారు.


సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ అదరగోట్టేశారు.. కనిపించింది రెండు సార్లే అయినా కమల్ తన మార్క్ ఏంటో చూపించేశాడు.తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కల్కి సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో సినిమా గురించి పోస్ట్ చేసారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తన పోస్ట్ లో.. కల్కి సినిమా చూశాను. వావ్.. ఇది అద్భుతమైన సినిమా. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాని వేరే లెవల్ కి తీసుకెళ్లారని అన్నారు. నా ఫ్రెండ్ అశ్వినీదత్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకోన్.. మిగిలిన కల్కి టీమ్ అందరికి కూడా నా అభినందనలు. సినిమా పార్ట్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని తలైవా తెలిపారు.రజినీకాంత్ ట్వీట్ కి దర్శకుడు నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ.. మాటల్లేవు సర్, మా టీమ్ అందరి తరపున మీకు ధన్యవాదాలు అని తెలిపాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కల్కి సినిమా గురించి గొప్పగా చెప్పడంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: