కల్కి 2898 AD: ప్రభాస్ సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికే కాన్ఫిడెన్స్ వచ్చిందా..??

Suma Kallamadi
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మూవీ హిట్ అయ్యాక దానికి సీక్వెల్ తీయడానికి చాలా ఏళ్లు పట్టేది. సినిమా అసంపూర్తిగా ఉన్నా సీక్వెల్ కి ఆస్కారం ఉన్నా, ప్రేక్షకులు దాని కోసం ఎంతో ఎదురు చూస్తున్నా సీక్వెల్ ను త్వరగా పూర్తిచేసే వారు కాదు. దానికి కారణం నిర్మాతలు, దర్శకులు, సినిమా యాక్టర్స్ లో నెలకొన్న భయమని చెప్పుకోవచ్చు. మొదటి సినిమా తీశాక రెండో సినిమాని హిట్ చేస్తారా? రెండో సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టొచ్చా? ఆల్రెడీ హిట్ చేసిన సినిమాకి నెక్స్ట్ పార్ట్ లో ఇంకేం చూపిస్తారని ప్రేక్షకులు దానిని రిజెక్ట్ చేస్తారా వంటి భయాలు ఉండేవి. కానీ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా తర్వాత ఈ భయాలన్నీ ఇండియన్ ఫిలిం మేకర్స్‌లో పటాపంచలయ్యాయి.
బాహుబలి పార్ట్ వన్ కంటే బాహుబలి పార్ట్ 2 మరింత హిట్ కావడంతో దర్శక నిర్మాతలు రాజమౌళి ప్రభాస్ బాట పట్టారు. బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి బాహుబలి మూవీ అభయం ఇచ్చింది. పెద్ద సినిమాలను రెండుగా విభజించవచ్చని, పార్ట్ 2ను హై బడ్జెట్‌తో నిర్మించవచ్చని, అలా నిర్మించినా నష్టాలు కంటే లాభాలే ఎక్కువ ఉంటాయని రాజమౌళి అందరిలో ధైర్యం నింపారు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాని పార్ట్ 2గా తీయొచ్చని బాహుబలి సక్సెస్ చూసాకే సుకుమార్ కు ధైర్యం వచ్చింది. ఇక ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాని సైతం రెండు పార్టులుగా తీయాలని ప్రశాంత్‌ నీల్ నిర్ణయించారు. కల్కి 2898 AD ని కూడా రెండుగా విభజించి తీయాలని దర్శకుడు నాగ అశ్విన్‌ నిర్ణయించాడు.
ఈ పార్ట్స్‌ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ చేస్తే చాలు తాము థియేటర్లకు పోటెత్తి సూపర్ హిట్ అందిస్తాం అని డైరెక్ట్ గా ఇంటి చేస్తున్నారు అయితే హిట్ అయిన సినిమాలు మాత్రమే ఇది వర్తిస్తుంది మంచి సినిమాలు తీసిన వారు మరో మంచి సీక్వెల్ తీయడం అనేది దాదాపు సాధ్యమే. బాలీవుడ్ లో టైగర్ త్రీ వంటి సీక్వెల్ సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. మొత్తం మీద బాహుబలి అనేది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద రెవల్యూషన్ కి దారి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: