కల్కి 2898 AD: కల్కి మూవీ చూసి ప్రభాస్‌కి ఫ్యాన్ అయిపోయిన అకిరా..?

Suma Kallamadi
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా రిలీజ్ అయి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అమెరికాతో సహా కొన్ని దేశాలలో ఈ సినిమా ముందే ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకులను అలరించింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో చాలామంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఫలితంగా మొదటి రోజు టిక్కెట్లు దొరకడం దాదాపు అసాధ్యమైంది.
 ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా ప్రభాస్ అభిమాని అని నిరూపించాడు. కల్కి సినిమా రిలీజ్ రోజు, కల్కి ఫ్యాన్ టీ షర్ట్ వేసుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రసాద్ మల్టీప్లెక్స్‌కి చేరుకున్నాడు. అయితే, అక్కడ అభిమానుల తాకిడి చాలా ఎక్కువగా ఉండటంతో, అకీరా నందన్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి కాకుండా పార్కింగ్ ఏరియా నుంచి పైకి వెళ్ళాడు. ఈ విజువల్స్ క్యాప్చర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అకీరా నందన్ కల్కి సినిమా చూసి చాలా ఆనందించాడని సమాచారం.
ప్రభాస్ అభిమానులు అకీరా నందన్ కల్కి టీ షర్ట్ ధరించిన వీడియోను వైరల్ చేస్తున్నారు! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా తమ ప్రభాస్ కే ఫ్యాన్ అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అతిథి పాత్రలలో కనిపించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించాడు. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, సినిమా చూడాలని చాలా మంది థియేటర్లకు వెళ్ళారు.
ఈ మూవీ హిట్ అయితే అసలు తర్వాత ప్రభాస్ కడతారో మరో హిట్ పడినట్లు అవుతుంది దానివల్ల అతనికి ఫ్లాప్స్ నుంచి చాలా వరకు రిలీఫ్ దొరికినట్లు అవుతుంది. ఈ మూవీలో విజువల్స్ కేక ఉన్నాయని చూసినవారు అంటున్నారు. ఈ మౌత్‌ టాక్ వల్ల థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందాలని చాలామంది అనుకోవచ్చు. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: