క‌ల్కి 2898 ADలో ఎంతమంది హీరోలు, హీరోయిన్లు నటించారో తెలిస్తే అవాక్కవుతారు!

Suma Kallamadi
ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశమంతటా కూడా ఒకటే టాక్ నడుస్తోంది. అదే ప్రభాస్ నటించిన సినిమా క‌ల్కి 2898 AD మానియా. డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ భారీ బడ్జెట్లో నిర్మించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఎంతమంది నటించారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఆసక్తికరంగా చాలామంది హీరోలు నటించినట్టు సినిమా చూసి వచ్చినవాళ్లు చెబుతున్నారు.
ఈ సినిమాలో ప్రధాన హీరోగా ప్రభాస్ నటించినప్పటికీ చాలా పాత్రలలో ఇతర హీరోలు కనువిందు చేసారని టాక్ వినబడుతోంది. విలన్ పాత్ర నుండి ఒకసారి చూస్తే... యాష్కిన్ పాత్రను లోకనాయకుడు కమల్ హాసన్ సమర్థవంతంగా పోషించారట. అవును, కమల్ హాసన్ తనదైన విలక్షణ నటనతో తన పాత్రలో ఇమిడిపోయాడు. ఇక అశ్వద్ధామ అనే పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఇరగదీసేసారు. ఇక భైరవ పాత్రను గురించి చెప్పేదేముంది? న భూతో న భవిష్యతి. పైలెట్ పాత్రలో హీరో దుల్కర్ సల్మాన్, అర్జునుడి పాత్రలో హీరో విజయ్ దేవరకొండ, శంభాల ప్రాంతానికి చెందిన యువకుడిగా యువ హీరో హర్షిత్ రెడ్డి, శంబాల ప్రాంతం నుంచి కాశీకి వచ్చిన ఒక వ్యక్తిగా రాజేంద్రప్రసాద్, తమిళ నటుడు పశుపతి, ఇలా మొత్తంగా ఈ సినిమాలో 8 మంది హీరోలు నటించడం జరిగింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్లను చూసుకుంటే... సుమైటీ అలియాస్ సుమతి అనే పాత్రలో దీపికా పదుకొనే, కైరా పాత్రలో మలయాళ హీరోయిన్ అన్నా బెన్, ఉత్తర పాత్రలో మలయాళ హీరోయిన్ మాళవిక నాయర్ కనువిందు చేయడం జరిగింది. ఇక ప్రభాస్ తో కాసేపు ప్రేమాయణం నడిపే రాక్సీ అనే పాత్రలో దిశా పటాని, అలనాటి నటి శోభన, జాతి రత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటించగా బుజ్జి అనే గాడ్జెట్ కి కీర్తి సురేష్ వాయిస్ అందించినట్టు సమాచారం. అలా మొత్తం మీద ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు నటించినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: