ఏపీలో ఆ వార్త ఛానళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు.. ఇకపై నిరంతర ప్రసారం!

Anilkumar
ఆంధ్రప్రదేశ్ లో జూన్ 6వ తేదీ నుంచి కొన్ని వార్త ఛానల్ లో ప్రసారం నిలిపివేత జరిగిన సంగతి మనకు తెలిసిందే. సాక్షి టీవీతో పాటు ఎన్టీవీ 10 టీవీ వార్త ఛానల్ లను నిలిపివేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా వార్తా ప్రసారాలను నిలిపివేసిన చానల్లను తిరిగి పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను న్యాయస్థానం ఖండించింది. తద్వారా న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య సమాజానికి మూల స్తంభాలైన వాక్ స్వాతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక సూత్రాలను బలోపేతం చేస్తుందని ఫెడరేషన్ సభ్యులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో కేవలం రాజకీయాల కారణంగా రాజకీయ పార్టీలు మారడంతో వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఛానల్ ను నిలిపివేయడం జరిగింది. తద్వారా ఆందోళనకర పరిస్థితిలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఫైబర్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య 65 లక్షల మంది వరకు ఉన్నారు. ఇక్కడ సెటప్ బాక్స్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది.
ఈ క్రమంలోనే కొన్ని వార్త చానళ్ళ ప్రసారం నిలిపివేయడంతో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ ప్రసారాలను నిలిపివేయటమే కాకుండా ప్రేక్షకుల సమాచార హక్కులను నిలిపివేయటం దురదృష్టకరమని తెలిపారు.ట్రాయ్ నిబంధనల ప్రకారం ఇలా న్యూస్ ఛానల్లను డిస్ కనెక్ట్ చేయడం చెడ్డ విరుద్ధంగా నేరమని టీవీ9 ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ విషయంలో హైకోర్టు జోక్యం ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి ఆసక్తి ఉన్న వార్త ఛానల్ ను చూసే హక్కు కొనసాగుతుందని నిర్ధారించడమే కాకుండా ఇప్పటికే నిలిపివేయబడిన న్యూస్ ఛానల్లను తిరిగి పునరుద్ధరించాలి అంటూ హైకోర్టు తీర్పున వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: