నా కొడుకు జోలికి వస్తే చంపేస్తా... రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఇక ఒక్కోసారి ఇలాంటి వాటికి సీరియస్ గానే రియాక్ట్ అవుతుంది. పవన్ గురించి మాట్లాడినప్పుడు నా ప్రస్తావన ఎందుకు అని కౌంటర్లు ఇస్తుంది. ఇక తాజాగా తన పిల్లలపై వచ్చే కొన్ని వార్తలని తీవ్రంగా ఖండించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా అఖీరా ను తక్కువ చేసి మాట్లాడినందుకు రేణు దేశాయ్ ఒక నెటిజన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. పవన్ వారసుడిగా అఖీరానందన్ కూడా హీరో అయితే బాగుండని అభిమానులు చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ అకీరాకు యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదని రేణు దేశాయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆకిరాను జూనియర్ పవర్ స్టార్ అనడం ఆపడం లేదు అభిమానులు.
ఎప్పటికైనా అకిరాను వెండితెరపై చూడాలని ఆశిస్తున్నారు. ఇక అటువంటి కామెంట్స్ పెట్టిన చాలామంది అభిమానులపై ఇప్పటికే రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. కానీ ఈసారి భిన్నంగా ఓ నెటిజన్ మాత్రం.. వాడి మొహం యాక్టర్ అయ్యేలా ఉందా.. అంటూ అకీరాను చెంచుపరిచాడు. దీంతో " ఇలాగేనా మీ అమ్మ నిన్ను పెంచింది. కెరీర్ ప్రారంభించక ముందే ఒక అబ్బాయి గురించి ఇలా మాట్లాడతారా. ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభిస్తున్న అబ్బాయి గురించి ఇలా మాట్లాడవచ్చా. అసలు అర్హత అనే పదానికి అర్థం తెలుసా. ఒకవేళ తన మొహాన్ని చూపించేంత అర్హత తనకు లేకపోతే నువ్వు చూడకుండా ఉండటం మంచిది. నువ్వు సిగ్గు లేకుండా నన్ను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతూ నా కొడుకు గురించి మాట్లాడుతున్నావ్. కొడుకు జోలికి వస్తే చంపేస్తా " అంటూ వార్నింగ్ ఇచ్చింది రేణు దేశాయ్.