రష్మిక కొత్త మూవీలో ఆ స్టార్ హీరోయిన్.. వామ్మో ఏంటి ఈ ట్విస్ట్..!?

Anilkumar
పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక ఇంపార్టెంట్ రోల్ లో  ప్రేక్షకులకు కనిపించబోతోంది. ఇక చాలా రోజుల తర్వాత మేకర్స్ ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన అప్డేట్ ను రిలీజ్ చేశారు. రష్మిక తో పాటు ఈ సినిమాలో మరో బ్యూటీ కీలకపాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా రాహుల్ రవీంద్రన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షూటింగ్ సమయంలో అను ఇమ్మాన్యుయేల్‌ పై

 వచ్చే సీన్స్ ను తన మానిటర్ లో చెక్ చేసుకుంటున్న ఫోటోని పోస్ట్ చేశారు. దానితో ఇందులో  అను ఇమ్మాన్యుయేల్‌ కూడా  నటిస్తోంది అని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ ఏ రివిల్ చేశారు. ఇంతకీ ఈ భామ ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే అల్లు అరవింద్   సమర్పణలో ఈ మూవీని  మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తుండగా విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రంన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా కన్నడ

 యాక్టర్ దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా పాపులర్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక రష్మిక సినిమా విషయానికి వస్తే. ఒకవైపు పాన్ ఇండియా పై ఫోకస్ చేస్తూనే మరోవైపు ఫిమేల్ ఓరియోటేడ్ సినిమాలు కూడా చేస్తోంది.ఇక ఈమె తాజాగా నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ చివరి దశకు రాగ డిసెంబర్ నెలలో లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. రష్మిక తెలుగు, తమిళం, బాలీవుడ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది  . హిందీలో పెద్ద స్టార్ నటులతో నటించే అవకాశం రష్మిక మందన్నకు అందుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా సూపర్ డూపర్ హిట్. తెలుగు, తమిళ్ లో విడుదలైన ఈ సినిమా  సంచలన విజయం సాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: