ఎన్టీఆర్ తో రొమాన్స్ కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని లైన్ లో పెడుతున్న డైరెక్టర్..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా రాబోతోంది. సముద్రం బ్యాక్ డ్రాప్లో సాగే ఈ సినిమాతో కొరటాల శివ భారీ విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటున్నారు. ఇకపోతే దేవ రాసిన మా రెండు భాగాలుగా రాబోతున్నట్లు దర్శకుడు ఇటీవల అధికారిక ప్రకటన చేశారు. ఎందుకంటే దేవర సినిమా మా స్టోరీ చాలా పెద్దగా

 ఉండడంతో మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతోనే ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం ఇవ్వబోతోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో

 ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ , దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం అవుతుందని మైత్రి మూవీస్ ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అయితే అలియాభట్ హీరోయిన్ గా నటిస్తుందా లేక ముఖ్య పాత్ర పోషిస్తుందా అనేది తెలియాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: