నష్టాల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్.. కల్కి కలెక్షన్స్ మోత మొగిస్తాడా?

Purushottham Vinay
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి సంక్రాంతి సినిమాలు కళ తీసుకొచ్చాయి కానీ, ఆ తర్వాత అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాలు ఏవి రాలేదు. గడిచిన ఐదు నెలల్లో సరైన సినిమా లేక ధియేటర్లు అన్నీ కూడా బోసిపోయాయి. ఓవైపు మలయాళం ఇండస్ట్రీ నుంచి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లు వస్తుంటే, తెలుగులో మాత్రం పెద్ద సినిమాలు రిలీజ్ చేసుకోడానికే వెనకడుగు వెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.ఐపీఎల్ క్రికెట్, ఎలక్షన్స్, ఎండల తీవ్రతతో జనాలు సినీ వినోదం కోసం థియేటర్లకు రాలేదు. ఈ కారణం వలన పెద్ద హీరోలంతా కూడా ఈసారి సమ్మర్ సీజన్ లో సినిమాలు విడుదల చెయ్యలేదు. అయితే ధైర్యం చేసి మార్చి నెలాఖరున వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. కానీ ఈ సినిమా తర్వాత జనాలను రప్పించి, థియేటర్లకు కళ తీసుకొచ్చే ఒక్కటంటే ఒక్క మూవీ కూడా రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ఫ్యామిలీ స్టార్' కూడా డిజాస్టర్ గా మారింది. 


మధ్యలో కొన్ని మీడియం రేంజ్ మూవీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, జనాలు థియేటర్ల వైపు చూడకపోవడంతో కమర్షియల్ ఫెయిల్యూర్స్ అయ్యాయి.ఇక చిన్నా చితకా చిత్రాలైతే, ఎప్పుడొచ్చాయో తెలియకుండానే అలా వచ్చి ఇలా ఈజీగా వెళ్లిపోయాయి. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కొన్ని నెలలుగా నష్టాలతో మునిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న 'కల్కి 2898 AD' మూవీ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా హిట్టయితే మళ్ళీ ఎప్పటిలాగే బాక్సాఫీసు మెరిసిపోతుంది.రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా 'కల్కి 2898 ఏడీ'. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పఠానీ ఇంకా అలాగే మాళవిక అయ్యర్ లాంటి స్టార్ కాస్టింగ్ ఈ క్రేజీ మూవీలో భాగం అయ్యారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దాదాపు నాలుగైదు నెలల తర్వాత థియేటర్లలోకి రాబోతున్న పెద్ద హీరో సినిమా కావడంతో సినీ అభిమానులతో పాటుగా ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: