బంపర్ ఆఫర్ కొట్టేసిన సమంత.. కానీ ఈసారి అలా కాదు..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే సమంత కెరియర్ పరంగా ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. తనకి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా గత ఏడాది నుండి సినిమాలకి దూరంగా ఉంటుంది సమంత. స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. సినిమాలతో బిజీగా లేక పోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హీట్ పుట్టించే పిక్స్ షేర్ చేస్తూ వైరల్ అవుతోంది. ఒక్కోసారి హెల్త్ కు సంబంధించిన పోస్టులు పెడుతుంటోంది. సిల్వర్ స్క్రీన్ పై

 ఆమె కనిపించి చాలా నెలలు గడవగా.. ఇటీవల తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పై 'మా ఇంటి బంగారం' మూవీ అనౌన్స్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఆమె మయోసైటిస్ నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదని, చికిత్స తీసుకుంటుందని కూడా టాక్ వినిపిస్తోంది.  అయితే పెద్ద హీరోల సినిమాలు దేంట్లోనూ సమంత లేదు. దాంతో ఆమె హీరోయిన్ ఓరియెంటెండ్ సినిమాలు చేస్తోంది.  బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కి హీరోయిన్ సమంత చాలా పెద్ద అభిమాని

 అన్న సంగతి తెలిసిందే. అయితే వీళ్లిద్దరూ కలిసి ఒక్క ప్రాజెక్టుకు పనిచేయలేదు. అయితే ఆ సమయం వచ్చేసిందని, ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందని నిన్నటి నుంచి మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆ వార్తల్లో టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌ మరో సినిమా చేయబోతున్నారని ఉంది. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇదే నిజమైతే షారూఖ్ తో, రాజ్‌కుమార్ హిరానీతో సమంతకి ఇదే తొలి సినిమా అయ్యేది. కానీ అది ప్రస్తుతానికి ఈ వార్త రూమర్ అనే క్లారిటీ వచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: