పెరిగిన శ్రీ విష్ణు క్రేజ్.. షూట్ పూర్తి కాకముందే దేశవ్యాప్త థియేటర్ హక్కులు సోల్డ్..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన క్రేజ్ ను రోజు రోజుకు పెంచుకుంటున్న నటలలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈయన నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. పోయిన సంవత్సరం ఈ నటుడు సామజవరగమన అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. పోయిన సంవత్సరం సమజవరగమన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ఈయన ఈ సంవత్సరం ఇప్పటికే ఓం భీమ్ బుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
 

ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. వరుసగా రెండు విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ నటుడు ప్రస్తుతం స్వాగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకు శ్రీ విష్ణు, ఆసిత్ గోలి కాంబోలో రాజ రాజ చోరా అనే మూవీ వచ్చి మంచి విజయం అందుకుంది.  ప్రస్తుతం సమజవరగమన, ఓం బీమ్ బుష్ మూవీల విజయాలతో ఫుల్ జోష్ లో శ్రీ విష్ణు హీరోగా నటించిన మూవీ కావడం, అలాగే శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబోలో ఇదివరకు రూపొందిన రాజ రాజ చోరా కూడా మంచి విజయం సాధించి ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఈ మూవీ యొక్క ఆల్ ఇండియా థియేటర్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. ఆ విషయాన్ని ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి సంస్థ ఈ మూవీ యొక్క ఆల్ ఇండియా థియేటర్ హక్కులను దక్కించుకున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, మీరే జాస్మిన్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ssv

సంబంధిత వార్తలు: