డార్లింగ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్న నాగార్జున.. పోస్ట్ వైరల్..!

lakhmi saranya
ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ అవుతున్న పేరు ప్రభాస్. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న కల్తీ సినిమాపై ప్రెసెంట్ ప్రతి ఒక్కరి ధ్యాస పడింది. ఎక్కడ చూసినా కల్కి.. పేరే వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే మన టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఈ ఏడాది నా సామిరంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అదే ఫామ్ లో ప్రస్తుతం కుబేర షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు నాగార్జున. అలాగే బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 8 కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.
అయితే నాగార్జున పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎప్పుడో ఒకసారి తప్ప ఆయన పోస్ట్ పెట్టడు. అటువంటిది నాగార్జున తాజాగా కల్కి ట్రైలర్ పై ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ చూసిన నాగార్జున మేకర్స్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. " ఏం ప్రపంచాన్ని సృష్టించారు నాగి మీరు. మన భారతదేశం అపురూపమైన కథలను తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసి ‌ఆశ్చర్యపోయాను.
అమిత్ జి ఫైర్, కమల్ జస్ట్ వావ్. ప్రయోగాలు చేసే ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను ప్రభాస్. మీరు అద్భుతంగా కల్కి సినిమాను నిర్మించారు. ఈ మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు " అని ఆ ట్వీట్  లో పేర్కొన్నాడు నాగార్జున. ప్రజెంట్ నాగార్జున ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక కల్కి చిత్రం ఈనెల అనగా జూన్ 27వ తారీకున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందు భారీ హైప్స్ ని నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ అనంతరం ఎంత మీరా కలెక్షన్స్ రాబడుతుందో అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరులోనూ నెలకొంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: