తండ్రి, కొడుకుల కాంబో లో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ ఫ్యామిలీ నుండి ఇప్పటి జనరేషన్లో ఒక్క స్టార్ హీరోగా లేరు అని చెప్పొచ్చు  ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో చాలామంది స్టార్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక అందులో నుండి వచ్చిన వారిలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క స్టార్ హీరో ఉన్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీలో మాత్రం నాగార్జున తప్ప తన వారసులుగా వచ్చిన వారిలో ఎవరు కూడా స్టార్ హీరోగా ఎదగలేకపోయారు. అయితే తాజాగా ఇప్పుడు

 అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ ఒక సరికొత్త సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అది కూడా తన తండ్రి నాగార్జునతో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ సినిమాని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లు గా వార్తలు వినబడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మొత్తానికి బాలీవుడ్ దర్శకుడు తో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేశారు ఈ తండ్రి కొడుకులు.

 మరి ఈ సినిమాతో అయినా ఈ తండ్రి కొడుకులు విజయాన్ని అందుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.. ఇదిలవుండగా  అఖిల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సరైన సక్సెస్ ఒక్కటి కూడా లేకపోవడం ఆయన్ని భాగా ఇబ్బంది పెడుతుంది. ఇక మొత్తానికైతే వీళ్ళు ప్రస్తుతం వీళ్ళ ఫ్యామిలీ చేసిన సినిమాల్లో ఏది కూడా సరైన సక్సెస్ అయితే సాధించడం లేదు…ఇక ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ భారం మొత్తాన్ని నాగార్జున మోసుకుంటూ వస్తున్నాడు. ఇక మీదట ఇండస్ట్రీ లో భారీ సక్సెస్ లను అందుకొని తన బిడ్డలను కూడా స్టార్ హీరోలుగా చేయాలనే ఉద్దేశ్యం తోనే నాగార్జున కొన్ని మంచి కాంబినేషన్లను సెట్ చేసి పెడుతున్నాడు. మరి వీళ్ళిద్దరూ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి సంబంధించిన పనులు ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: