ఆ విషయంలో బాహుబలిని ఫాలో అవుతున్న నాగ్ అశ్విన్.. వర్కౌట్ అవుతుందా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. ఇక ఈ సినిమా విడుదల కి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో జోరు పెంచారు చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ట్రైలర్ పోస్టర్స్ ఇప్పుడే సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చూస్తున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీ దిశ మార్చే విధంగా కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. అందులో భాగంగానే ప్రభాస్ చేసిన

 బాహుబలి సినిమాతో ఆయనకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇక ఆ సినిమా రెండు భాగాలుగా విడుదల ఈ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ కి ఫ్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ప్రభాస బాహుబలి తర్వాత నుండి ఇప్పటివరకు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా

 వచ్చింది. ఇక ఈ సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో  చెప్పనవసరం లేదు. ఇక అప్పట్లో ఈ సినిమా గురించి టాలీవుడ్ మొత్తం మా సినిమానే అనేంత గర్వపడేలా చేసింది రాజమౌళి.  అప్పట్లో బాహుబలి సినిమాని చాలా సపోర్ట్ చేసింది టాలీవుడ్.  ఇప్పుడు కల్కి విషయంలో కూడా అదే రిపీట్ అవుతుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూసి మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడేలా ప్రభాస్ చేస్తున్నాడని గుర్తించి ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది.  ప్రభాస్ ఒక్కడికే ఇలా జరుగుతుంది ఎందుకని కొందరికి ఆలోచన ఉన్నా పరిశ్రమ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమాలు చేస్తున్నాడు కాబట్టే ఈ సపోర్ట్ వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కల్కి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం బాహుబలి రికార్డులు సైతం బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: