ఆ హీరోలతో రొమాన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!?

Anilkumar
నటీనటులుగా తమ సత్తా ఏంటో చూపించుకోవాలి అని చాలామంది సినీ ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించి దూరమవుతారు ఇక అలాంటి వారిలో ఈషా కొప్పికర్ కూడా ఒకరు. కెరియర్ మొదట్లో మంచి మంచి సినిమాల్లో అవకాశాలను అందుకున్న ఈమె ఆ తరువాత ఊహించిన విధంగా సినిమాలకు దూరమైంది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా తన

 సినీ కెరియర్ కి సంబంధించిన విషయాలను తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంది. అయితే ఇందులో ఆమె మాట్లాడుతూ.. తన కెరియర్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఒక స్టార్ హీరో తనను డ్రైవర్ లేకుండా ఒంటరిగా రమ్మన్నాడు అంటూ చెప్పకు వచ్చింది. అంతేకాదు చాలామంది నటీనటులు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. అందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ సీనియర్ హీరోలతో రొమాన్స్

 చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.. అస్సలు కంఫర్ట్ గా ఉండదు అంటూ బాంబు పేల్చింది ఈ నటి. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  “మీకంటే 30 లేదా 40 ఏళ్లు పెద్దవారితో పనిచేస్తున్నప్పుడు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. వయసు పైబడిన స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్నప్పుడు .. వారితో రొమాన్స్ సీన్స్ చేస్తున్నప్పుడు అసలు నచ్చదు. కంఫర్ట్ గా అనిపించదు. వారికి కౌగిలించుకున్నప్పుడు తండ్రిని హత్తుకున్నట్లుగా అనిపిస్తుంది.. భాగస్వామిని కాదు. నేను సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చినప్పుడు నాకు అలాగే అనిపించింది. నేను కొత్త కదా అనుకున్నాను. యాక్టింగ్ సమయంలో కేవలం నటనపై మాత్రమే దృష్టి పెడతాము.. అప్పుడు వారు మనకంటే పెద్దవారనే విషయాన్ని మార్చిపోతాము. అంటూ చెప్పుకొచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: