ఆ ఒక్క విషయంలో చిరంజీవి కంటే నేను ఎప్పుడూ తక్కువే.. రజినీకాంత్..!?

Anilkumar
సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ చిరంజీవి రజనీకాంత్ లకి సపరేట్ ఫ్యామిలిస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక వీళ్ళిద్దరూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతటి గుర్తింపును సంపాదించుకున్నారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళం నుండి రజినీకాంత్ తెలుగు నుండి చిరంజీవి సమానంగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు వీళ్ళకి దీటుగా వచ్చిన హీరో కానీ వీళ్ళకి ధీటుగా ఎక్కువ

 ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నవారు కానీ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు లేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఒకప్పుడు వీళ్ళ సినిమాలో టీవీల్లో వస్తున్నాయి అంటే చాలు ఎగబడి మరీ చూసే వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం దానికంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లు అయిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకి పోటీగా  సినిమాలు చేస్తున్నారు. అందుకే వీళ్ళ సినిమాలను చూడడానికి అంతలా ఇష్టపడుతున్నారు  ఆడియన్స్. ఈ నేపథ్యంలో రజనీకాంత్ డాన్స్ చెయ్యకపోయినప్పటికీ తనదైన స్టైల్ లో అందరిని ఆకట్టుకునేవారు. అలాగే చిరంజీవి మాత్రం విపరీతమైన డాన్స్

 చేస్తారు.  తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలాగే భారీ ఫైట్స్ సన్నివేశాలు కూడా చేస్తారు. అలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు చిరంజీవి. అయితే ఒకప్పడు  బాలీవుడ్ లోని ఒక మ్యాగజైన్ ‘బిగ్గర్ దేన్ బచ్చన్’ అంటూ చిరంజీవి గురించి రాయడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది.  ఇక ఇదే టైంలో రజనీకాంత్ కూడా నేను చిరంజీవి లా డాన్సులు చేయలేను ఆ ఒక్క విషయంలో ఆయన్ని నేనెప్పుడూ బీట్ చేయలేను అంటూ ఆయన పలు సందర్భల్లో తెలియజేయడం అనేది నిజంగా ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అనే చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికీ చిరంజీవి రజనీకాంత్ ఇద్దరు కూడా బయట మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: