ప్రభాస్ కల్కి లో ఆ స్టార్ హీరో క్యామియో రోల్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపోతే ఈ సినిమా ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. కాసుల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ఇక ఈ సినిమా కోసం తెలుగు సినీ ఆడియన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడెప్పుడు కల్కి సినిమాని చూస్తామా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ అభిమానులు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా

 విడుదలవుతుందా ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటున్నారు. మహానటి ఫెమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఏకంగా 600 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఇందులో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే దిశా పటాన్ని హీరోయిన్లుగా నటించబోతున్నారు. వారితోపాటు అమితాబచ్చన్ కమలహాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ సైతం పలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాగా ఈనెల 27న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఇప్పుడే వేగం పెంచేశారు మేకర్స్... ఇదిలా ఉంటే ఈ సినిమాలో

 సర్ప్రైసింగ్ క్యారెక్టర్స్ ను రివీల్ చేస్తూ రోజు రోజుకు ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అదిరిపోయే పాత్ర చేస్తున్నట్లు సమాచారం.అశ్వద్ధామ గా నటిస్తున్న అమితాబ్ బచ్చన్ పై పోరాడే సన్నివేశాలలో నటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే విజయ్ పాత్ర గురించి మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.విజయ్ పాత్ర సస్పెన్సుతో కూడి ఉండాలని ఉద్దేశంతో ఎక్కడ కూడా ఆ పాత్ర లీక్ కాకుండా చూస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఈ ట్రైలర్ లోని విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో వున్నాయి,దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: