నా కెరియర్ లో అదే వరస్ట్ మూవీ.. నయనతార..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన గజిని సినిమా అంత తేలికగా ఎవరో మర్చిపోలేరు. దిగ్గజ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించింది. ఇకపోతే 2005 లో వచ్చిన ఈ సినిమా సూర్య కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. అయితే తాజాగా ఈ సినిమాపై పలు షాకింగ్ కామెంట్స్ చేసింది లేడీ సూపర్ స్టార్ నయనతార. అయితే ఈ సినిమాలో చిత్రా అనే ఒక డాక్టర్ పాత్రలో కనిపించింది నయనతార. అయితే తాజాగా ఆ పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 అదేంటంటే నయనతార ఇటీవల దీని గురించి మాట్లాడుతూ.. ఈ పాత్ర తన కెరియర్ లోనే అత్యంత చెత్త ఎంపిక అంటూ చెప్పుకొచ్చింది.. తాను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో గజినీ సినిమా చాలా చెత్త సినిమా అని అంది.. అంతేకాదు నాకు గజిని ఒక పెద్ద చెత్త ఎంపిక అంటూ చెప్పుకొచ్చింది.. అంతేకాదు ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను అంటూ చెప్పింది.. ఈ సినిమాలో తన పాత్రను ముందుగా మేకర్ చెప్పినట్లుగా చిత్రీకరించలేదు అని చాలా చండాలంగా తనను ఇందులో చూపించారు అని.. చాలా చెత్తగా తన

 ఫోటోలను చిత్రీకరించారు అంటూ చెప్పుకొచ్చింది.. అయితే ఆ సమయంలో తాను ఇవేమి పట్టించుకోలేదని దాన్ని కెరీర్‌లో లెర్నింగ్ ప్రాసెస్ అనుకున్నానని వెల్లడించింది. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. గతేడాది జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. షారుక్- అట్లీ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం తెలుగు తమిళంలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది నయనతార. షారుక్ అట్లీ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం తనకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అలా కేవలం తెలుగు తమిళంలోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: