నవదీప్ బోల్డ్ మూవీ 'లవ్ మౌళి' ఓటిటి స్ట్రీమింగ్ అఫీషియల్ డేట్ వచ్చేసింది..!?

Anilkumar
టాలీవుడ్ యాక్టర్ నవదీప్ హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా లవ్ మౌళి. ఇక ఇందులో పంఖురి గిద్వాని హీరోయిన్ గా నటించింది ఆమెతోపాటు , ఛార్వీ దత్తా ఒక కీలక పాత్రలో కనిపించింది. అంతేకాదు రానా దగ్గుబాటి ఇందులో ఒక అతిధి పాత్రలో కనిపించారు. రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలై యావరేజ్ టాక్ అందుకుంది. మొదట భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ పోస్టర్లతో బాగా క్రియేట్ చేశారు. అంతేకాదు నవదీప్ ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా

 కొత్తదనాన్ని చూపించాడు. ఇకపోతే ఈ సినిమా కోసం తన గెటప్ ను పూర్తిగా మార్చేశాడు నవదీప్. అయితే భారీ అంచనాల నడుమ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. అలాగే ఈ సినిమాలో హీరో యాక్టింగ్ తో పాటు హీరోయిన్ సైతం మంచి మార్కులు కొట్టేసింది. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. తాజాగా దీని స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా అధికారిక ప్రకటన చేశారు. జూన్ 27 నుండి ఈ సినిమా ఓటిటి లోకి రాబోతున్నట్లుగా అఫీషియల్

 అనౌన్స్మెంట్ చేశారో. జూన్ 27 నుంచి లవ్ మౌళి స్ట్రీమింగ్ కు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ఆహా. అలాగే కు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. 'తను ప్రేమ గురించి మిమ్మల్ని గట్టిగా ఆలోచించేలా చేస్తాడు. త్వరలోనే ఆహాలో హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీ లవ్ మౌళి జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేయండి' అని క్యాప్షన్ ఇచ్చింది ఆహా. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్, సి స్పేస్ సంయుక్తంగా లవ్ మౌళి ను తెరకెక్కించారు. గోవింద్ వసంత ఈ కు సంగీతం అందించారు. రిలేషన్‌లో ఉన్న ఒక ప్రేమ జంట రెండు సంవత్సరాలు సంతోషంగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అనే కాన్సెప్ట్‌తో సాగుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: