మంచి ఘోస్ట్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

Anilkumar
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వస్తున్న చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అందులో హారర్ సినిమాలకి ఎక్కువ క్రేజ్ ఉంది.
అయితే తాజాగా మంచి ఘోస్ట్ అంటూ మరో కామెడీ హర్రర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవిన్ నేని, రఘుబాబు ఇలా భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా నేడు విడుదల అయింది. మరి ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే..
కథ:
చైతన్య (రజత్) తన మేనమామ ఎమ్మెల్యే సదా శివ రావు (నాగినీడు) వద్దకు ఒక సహాయం కోసం వెళ్లగా ఆయన మాత్రం తనకు సహాయం ఇలా తన మామయ్య సహాయం చేయకపోవడంతో అతనిపై కోపం ఆయన పోస్టర్ మీద తన పోస్టర్ పై పేడ తీసుకొని కొడతాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు తనని అరెస్టు చేసి జైలుకు పంపగా అక్కడ చైతన్యకు మరో ముగ్గురు పరిచయమవుతారు. అయితే వీరికి డబ్బు అవసరం చాలా ఉంటుంది.
ఇలా డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వారు తన మేనమామ కుమార్తె కీర్తి (నందిత శ్వేత) నీ కిడ్నాప్ చేయాలనుకుంటారు ఇలా అందరూ కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి ఆ ఊరి చివరన ఉన్న ఒక బంగ్లాలో వేస్తారు. అయితే అక్కడ ఒక దయ్యం ఉంటుంది. ఎవరైతే కిడ్నాప్ చేస్తారో కిడ్నాప్ చేసిన వారిని ఆ దయ్యం చంపుతూ ఉంటుంది. మరి ఆ దయ్యం నుంచి ఈ నలుగురు బయటపడ్డారా? అసలు కీర్తికి ఉన్న  సమస్య ఏంటి కీర్తి నుంచి ఆ దయ్యం నుంచి ఆ నలుగురు బయటపడతారా లేదా అన్నది సినిమా కథ.
నటీనటుల నటన:
వెన్నెల కిషోర్, షకలక శంకర్ థియేటర్లో ప్రేక్షకుల్ని పగలబడేలా నవ్విస్తుంటారు. వీరిద్దరికీ ఇలాంటి పాత్రలేమీ కొత్త కాదు. ఎప్పటిలాగే మరోసారి వీరిద్దరూ కలిసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.నందిత ఆల్రెడీ ఘోస్ట్‌గా ఇది వరకు భయపెట్టేసింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా ద్వారా మరోసారి తన నటన విశ్వరూపం చూపించింది. ఇక రఘుబాబు రజత్ నవీన్ వీరందరూ కూడా వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు.
విశ్లేషణ:
ఒకప్పుడు హార్రర్ చిత్రాలంటనే ప్రేక్షకులకు ఎంతగానే భయపట్టేవి. కొన్ని రోజులు వరకు చూసిన ప్రేక్షకుల మదిలో ఎంత కాలం వెంటాడేవి. రాను రాను ఇలాంటి సీరియస్ కాన్సెప్ట్ హార్రర్ కథలకు చెల్లు చీటి పడింది. క్రమంగా దెయ్యాలతో కూడా కామెడీ చేయించే సరికొత్త టెక్నిక్ మన దర్శకులు పట్టేసారు. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు తర్వాత వచ్చే సీన్ ఏంటి అనే విషయం ప్రేక్షకులు చాలా తొందరగా అంచనా వేయగలుగుతారు.
ఫస్ట్ హాఫ్‌లో ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఈ గ్యాంగ్ ఆ మహల్‌లో ఎంట్రీ ఇచ్చాక కథ మారుతుంది. అక్కడి నుంచి నవ్వుల పంట పండిచేస్తుంటారు. ఇంటర్వెల్‌కు ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో దెయ్యాలతో చేసే కామెడీ హైలెట్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే కనుక సెకండ్ పార్ట్ కూడా రాబోతుందా అన్న సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. మొత్తానికి ఈ సినిమాని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తారు.
టెక్నికల్:
టెక్నికల్‌గా విషయానికి వస్తే ఈ సినిమా  ఈ  పాటలు కూడా పరవాలేదు, విజువల్స్ బాగుంటాయి. కెమెరా వర్క్‌తోనే భయపెట్టేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే పని చేసింది. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు అద్భుతమైన స్క్రీన్ పైన చూపించారు ఇక నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.
రేటింగ్ 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: