కల్కి: విడుదల కి ముందే ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్..!?

Anilkumar
మరో వారం రోజుల్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా థియేటర్స్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దాంతో ప్రమోషన్స్ చాలా గట్టిగా నేను నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో నిర్వహించారు. ఇక ఆ ఈవెంట్ కి అమితాబచ్చన్ కమలహాసన్ ప్రభాస్ దీపిక పదుకొనే అందరూ హాజరయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ట్రైలర్ పోస్టర్లు కల్కి సినిమాపై ఆశలను ఆకాశానికి ఎత్తేసాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుండి మరొక

 ట్రైలర్ విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే సెకండ్ ట్రైలర్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా దీనిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకి సరిగ్గా వారం రోజులు ఉన్న నేపథ్యంలో ఒక గుడ్ న్యూస్ చెప్పారు చిత్ర బృందం. అదేంటంటే.. ఈ ట్రైలర్ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వైజయంతీ మూవీస్  ఓ పోస్టర్ షేర్ చేస్తూ

 అసలు విషయం చెప్పేశారు. అలాగే ఈ లో బుజ్జి అనే కారు కూడా హైలెట్ కానుంది. ఓవైపు ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతుండగా.. మరోవైపు విదేశాల్లో కల్కి టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అమెరికాతోపాటు యూకేలో బుకింగ్స్ విషయంలో విశేష ఆదరణ లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కల్కి ప్రీ బుకింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సెన్సార్ టాక్, రన్ టైమ్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమమాకు సెన్సార్ రివ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. నెట్టింట వినిపిస్తున్న సమాచారం ప్రకారం కల్కి కు సెన్సార్ టాక్ అదిరిపోయిందని అంటున్నారు...!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: