కాజల్ బర్త్డేకి ఊహించని పనిచేసిన ఫ్యాన్స్.. ఎమోషనల్ అయిన చందమామ..!?

Anilkumar
టాలీవుడ్ చందమామ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ వంటి భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంది. ఇక అలా కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతం ను పెళ్లి చేసుకుని తన పర్సనల్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇక పెళ్లి తర్వాత ఒక బాబుకి కూడా జన్మనిచ్చింది. అలా కెరీర్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్ గత ఏడాది నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని

 అందుకోవడంతో తనకి వరుస  సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇకపోతే పెళ్లి ముందు వరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన కాజల్ ఇప్పుడు మాత్రం కేవలం ఇంపార్టెన్స్ సర్ ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలో సైతం చేస్తూ బిజీగా ఉంది. ఇకపోతే కాజల్ ఇటీవల సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇటీవల చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం పెద్ద హిట్

 కాలేకపోయింది. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 3 ,కన్నప్ప వంటి భారీ సినిమాల్లో నటిస్తుంది.ఆ సినిమాల్లో కాజల్  కేవలం అతిధి పాత్రే అని తెలుస్తుంది.ఇదిలా ఉంటే జూన్ 19 కాజల్ బర్త్డే సందర్భంగా ఆమె అభిమానులు మంచి పనులు చేసారు. తమ అభిమాన హీరోయిన్ బర్త్ డే సందర్భంగా సుమారు 150 మంది పేద పిల్లలకు భోజనాలు పంపిణి చేసారు. అలాగే 50 మొక్కలను కూడా నాటారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన కాజల్ ఎంతో ఎమోషనల్ అయింది.నాపై మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఎప్పటికి మర్చిపోలేను మీ అందరికి ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: