రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయనున్న ఎన్టీఆర్.. దేవర తో సాధ్యమవుతుందా..!?

Anilkumar
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ:1000 కోట్లకు పైగా భారీ కలెక్షన్ను అందుకుంది.  ఈ సినిమా పాటలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఈ తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు  వస్తున్నాడు. సముద్ర బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్  హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వం వహించిన ఆ సినిమా  తర్వాత ఆ హీరో నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుందని అభిమానులకు

 ఒక సెంటిమెంట్. అయితే ఇప్పటివరకు ఏ హీరో కూడా  ఆ సెంటిమెంట్ నీ బ్రేక్ చేయలేకపోయారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్  తర్వాత ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది. ఇక దీంతో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై ఎంత నమ్మకం ఉన్న కూడా  అభిమానులకు ఎక్కడో చిన్న డౌట్. ఇక ఆ సినిమా గురించి అభిమానులు ఒక సెంటిమెంట్ డౌట్ ను పట్టుకున్నారు. అదేంటంటే రాజమౌళి దర్శకత్వం తర్వాత ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1, జనతా గ్యారేజ్, జై లవ కుశ సినిమాలు సెప్టెంబర్ నెలలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక దానితో ఈ సినిమా కూడా సెప్టెంబర్ లోనే రిలీజ్ అయితే భారీ విజయాన్ని అందుకుంటుంది అని అంటున్నారు

 అభిమానులు.ఇక వాళ్ళు అనుకుందే నిజమైంది. గతంలో అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ సినిమానీ వాయిదా వేయకుండా ఫ్రీ ఫోన్ చేశారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు.ఇక ఈ సినిమా అప్డేట్ గురించి పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: