సరికొత్త క్రైమ్ త్రిల్లర్ వెబ్ సిరీస్ తో రాబోతున్న విజయ్ సేతుపతి..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మహారాజా అనే సినిమాతో చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందుకున్నాడు. రివెంజ్ త్రిల్లర్ నేపథ్యం లో వచ్చిన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 32 కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకుంది. తెలుగు లో 7.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ 3.75 కోట్ల వరకు షేర్ అందుకుంది. అంతేకాదు తెలుగులో బ్రేక్ ఈవెన్ దాటేసింది ఈ సినిమా. ఇకపోతే ఇప్పటివరకు విజయ్ సేతుపతి నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా మహారాజా రికార్డ్ చేసింది. ఇకపోతే ఈ సినిమా విజయ్ సేతుపతి కెరియర్ లో తన 50వ సినిమాగా వచ్చింది. ఇదిలవుండగా ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతి తమిళంలో ఏకంగా మూడు

 సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే తాజాగా ఈ మూడు సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉండబోతున్నట్లుగా సమాచారం. ఎం మణికందన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి విండ్ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్లుగా ఇటీవల మహారాజా ప్రమోషన్స్ కార్యక్రమంలో స్వయంగా విజయ్ సేతుపతి తెలిపాడు. ఈ సిరీస్ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు విజయ్ సేతుపతి చెప్పాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విండ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్

 కాబోతోంది. తొందరలోనే టైటిల్‌తో పాటు వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు. ఆగస్ట్‌లో ఈ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతోన్నారు. విండ్ సిరీస్‌లో జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. గతంలో విజయ్ సేతుపతి, డైరెక్టర్ ఎం. మణికందన్ కాంబినేషన్‌లో అండవన్ కట్టలై, కడైసి వివసాయి సినిమాలు రూపొందాయి. కడైసి వివసాయి మూవీ బెస్ట్ తమిళ్ మూవీగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నది. ధనుష్ ప్రొడక్షన్‌లో వచ్చిన కాకా ముట్టై మూవీతో ఎం. మణికందన్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: