పుష్ప 2 వాయిదా.. ఏకంగా కేసు పెడతా అంటున్న ఫ్యాన్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సైతం దక్కింది. అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే మొన్నటి వరకు పుష్ప సినిమాకి సంబంధించిన వరుస అప్డేట్స్ ఇచ్చారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా వాయిదా పడింది.

దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం తాజాగా చిత్ర బృందం అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో భారీ విజయాన్ని అందుకున్న పుష్ప సినిమాకి సీక్వల్ గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతూనే వస్తుంది కానీ ఇంకా పూర్తి అవ్వలేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. అందులో భాగంగానే రెండు

 పాటలను విడుదల కూడా చేశారు. టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. అలాగే సూసేకి పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. తాజాగా సినిమాను ఆగస్టు కాకుండా డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. అదే పోస్టర్ ను అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.. దానికి ఓ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది..పుష్ప-2 సినిమాను ముందుగా అనుకున్న టైం కే రిలీజ్ చెయ్యాలని కమ్యూనిటీ తరపున కోర్టులో కేసు వేస్తా అంటూ ఐకాన్ స్టార్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు.. ఒకవిధంగా హీరోకే వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది.. దాంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.. దీని పై బన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: