21 ఏళ్లు ఉన్నప్పుడే అలాంటి సినిమాలు చేశా.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన కియారా..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇకపోతే ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారు అన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ  తన పదేళ్ల కెరియర్ను పూర్తి చేసుకుంది. దీంతో ఆమె ఈ విషయంపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె

 ఇప్పటివరకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం పూర్తయింది. 2014లో ఆమె ఫగ్లి అనే ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో భాగంగానే ఆమె తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. కుటుంబంతో కలసి చూసే సినిమాల్లో భాగం కావడమే నా లక్ష్యం అని చెప్పిన కియారా.. నటిగా ఎదగాలనే లక్ష్యంతో 21 ఏళ్ల వయసులోనే కెరీర్‌ను ప్రారంభించాను అని గుర్తు చేసుకుంది. కెరీర్‌ ప్రారంభంలో ఏం చేస్తున్నానో కూడా తెలియదు, ప్రేక్షకులకు ఎలా దగ్గరవ్వాలో కూడా తెలియదు, అసలు ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో కూడా అవగాహన లేదు..


 కానీ ఒక్కొక్కటిగా తెలుసుకున్నా, సినిమాలు చేశా, ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా అని చెప్పింది కియారా. పదేళ్ల ప్రయాణంలో ఎలా పైకి ఎదగాలో నేర్చుకున్నాను, కథల ఎంపికలో ఎలా ఉండాలో తెలుసుకున్నాను అని చెప్పింది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఇప్పటికీ రోజూ కొత్తగానే అనిపిస్తుంటుందట. అంతేకాదు అసలు కెరీర్ మొదట్లో తను ఎటువంటి సినిమాలు చేస్తున్నానో ఏం చేస్తున్నాను అన్నది కూడా తెలియకపోయేది అని అసలు ప్రేక్షకులకు ఏ సినిమాలు చేసిన దగ్గర అవ్వాలో అన్నది కూడా తెలియదు అని మొదట్లో అసలు సినిమాలపై ఎటువంటి అవగాహన లేదు అంటూ తెలిపింది. కానీ నిదానంగా ఒక్కొక్కటి తెలుసుకున్నాను అని.. అలా తెలుసుకుంటూ వచ్చి ఎన్నో సినిమాలు చూసి ఇప్పుడు ఇంతమంది జనాల అభిమానాన్ని పొందాను అని పేర్కొంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: