ఆ సినిమా కోసం భారీ రిస్క్ చేస్తున్న రామ్ చరణ్.. ఏకంగా ఆస్ట్రేలియాలో..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయనతోపాటు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా ఈ ఇద్దరి స్టార్ హీరోల పేర్లు వినబడుతున్నాయి. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఈ ఇద్దరు హీరోలని ఆకాశానికి తీసుకువెళ్లాడు దర్శక ధీరుడు రాజమౌళి. అంతే కాదు ఈ ఇద్దరి నటనకి గాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. అయితే ఈ ఇద్దరు హీరోలు కూడా ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.

అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపుగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 450 కోట్లకు చేరుకుంది అని అంటున్నారు. ఇంత పెద్ద బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. షూటింగ్ మొత్తం పూర్తిచేసి త్వరలోనే విడుదల కి సంబంధించిన తేదీని కూడా అనౌన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకి

 సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే.. ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించి 2 రోజుల షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తుంది, ఆ తర్వాత తన నెక్స్ట్ పనులను ప్రారంభించనున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్ట్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ16. ఇది స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడట. ఇందుకోసం రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్లనున్నాడట, అందుకు కనీసం రెండు నెలల సమయంతీసుకోనున్నాడని తెలుస్తోంది. రామ్ చరణ్ ఆస్ట్రేలియాలోని అత్యుత్తమ శిక్షకులతో శిక్షణ తీసుకోనున్నారు. బాడీ బిల్డింగ్ తో పాటు తన పాత్ర కోసం మేకోవర్ కూడా చేస్తాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: