కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. అక్కడి నుండే ఫస్ట్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ అందరూ దీనిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదల కి ఇంకా చాలా రోజులు ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా డార్లింగ్ అభిమానులు ఇప్పటినుండి హంగామా మొదలు పెట్టేసారు. కల్కి విడుదల కి మరొక వారం రోజులు సమయం ఉండడంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో వేగం

 పెంచారు చిత్ర బృందం. ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ల ను నిర్వహిస్తున్నారు. అలాగే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఒక ఈవెంట్ నిర్వహించేందుకు  ముంబైకి బయలుదేరారు చిత్ర బృందం. అయితే డార్లింగ్ సైతం తాజాగా ముంబైకి చేరుకున్నట్లు గా సమాచారం వినబడుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం లో ప్రభాస్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం

 అందించారు.. ఈ సినిమాకు ప్రస్తుతం భారీస్థాయిలో రెస్పాన్స్ వస్తుంది.. ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ టీజర్ ట్రైలర్ పాటలు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. అంతేకాదు టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత డార్లింగ్ పెర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా ఉంది అంటూ ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ సైతం ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుము విడుదల కాబోతున్న ఈ సినిమా విడుదల ఎటువంటి విజయాన్ని ఎందుకు ఉంటుందో చూడాలి మరి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: