రోబో 2.0 : అన్ని కోట్ల సాంగ్.. ఏమైనా ప్రయోజనం ఉందా..?

MADDIBOINA AJAY KUMAR
కొంత మంది ఫిలిం మేకర్స్ తమ సినిమాలోని పాటలు అద్భుతంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగా సినిమా చిత్రీకరణలో భారీ ఎత్తున పాటలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఇక సినిమా బాగుండి , ఆ సాంగ్ చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉన్నట్లు అయితే ఆ మూవీ కి అదనపు ఆకర్షణల ఆ పాటలు నిలుస్తూ ఉంటాయి. కానీ కొన్ని పాటలను చాలా ఖర్చు పెట్టి తీసిన కూడా ఆ పాటల ద్వారా సినిమాలకు ఎలాంటి ఉపయోగం లేని సాంగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇండియాలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ తన సినిమాలలో పాటలను తెరకెక్కించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు.

ఎంతో ఖర్చుతో పాటలను చిత్రీకరిస్తూ ఉంటాడు. ఇక ఈయన సినిమాలోని పాటలను చూడడానికి జనాలు అత్యంత ఇష్టపడుతుంటారు. కొంత కాలం క్రితం శంకర్ , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రోబో 2.0 అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంత్ర లోకపు సుందరివే అనే సాంగ్ ఉన్న విషయం మనకు తెలిసింది. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం దాదాపు 20 కోట్లు ఖర్చు చేశారట. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించగా అనంత శ్రీరామ్ ఈ పాటకు లిరిక్స్ అందించారు.

ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీలోని ఈ సాంగ్ లిరికల్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాట అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. దానితో సినిమాలో ఈ పాట ఏ స్థాయిలో ఇంపాక్ట్ ను చూపిస్తుందా అని జనాలు అంతా అనుకున్నారు. ఇక తీరా చూస్తే ఈ సినిమాలో అంతర్భాగంగా ఈ పాట రాకుండా సినిమా మొత్తం అయ్యాక ఈ పాటను ప్లే చేశారు. ఇక దాదాపు సినిమా మొత్తం అయిపోవడంతో ప్రేక్షకులు అంతా ధియేటర్ వదిలి వెళ్ళిపోతారు. దానివల్ల ఈ సాంగ్ ని థియేటర్లో చూసిన వారి సంఖ్య కూడా చాలా తక్కువే. దానితో 20 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ పాట ద్వారా ఈ సినిమాకు పెద్దగా ఇలాంటి ఉపయోగం జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: