పుష్ప 2 లో బిగ్ బాస్ దివి... ఏ పాత్రలోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలలో పుష్ప పార్ట్ 2 మూవీ ఒకటి. ఇప్పటికే పుష్ప మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ కి సంబంధించిన మరో 50 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు.

కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా 50 రోజులు పెండింగ్ ఉండడం, అలాగే ఈ 50 రోజులకు సంబంధించిన షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ ఉండడంతో ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయడం కష్టం అనే ఉద్దేశంతో ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాలో బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న దివి ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ పై ఇప్పటివరకు సన్నివేశాలను చిత్రీకరించలేదు అని సమాచారం. మిగిలి ఉన్న 50 రోజుల షూటింగ్ లో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో ఈ బ్యూటీ పాత్ర నిడివి చాలా తక్కువ గానే ఉన్నప్పటికీ, సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి నిజం గానే ఈమెకు పుష్ప 2 లో కీలకమైన పాత్ర లభించినట్లు అయితే ఈ సినిమా ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించే అవకాశం చాలా వరకు ఉంది. రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఈ మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా, పహాద్ ఫాజిల్ ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనసూయ, సునీల్, రావు రమేష్ ఈ మూవీలో ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: