మెల్లిమెల్లిగా దగ్గరకొచ్చేసిన శర్వా.. ఇంకో 2..3 రోజుల్లో కథ క్లోజ్..?

Pulgam Srinivas
శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే.  ఈ సినిమాకు వషిం అబ్దుల్ వహెబ్ సంగీతం అందించగా , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ జూన్ 7 వ తేదీన విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. దానితో మొదటి మూడు రోజులు వచ్చిన స్థాయి కలెక్షన్లు ఈ మూవీకి వీకెండ్ పూర్తి అయిన తర్వాత రాలేదు. దానితో ఈ సినిమా పెద్ద మొత్తంలో నష్టాలను చూస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆ తర్వాత పుంజుకుంది. మెల్లిమెల్లిగా కలెక్షన్లను రాబడుతుంది. రెండవ వారం వచ్చినా కూడా ఈ సినిమా ఓ వైపు మహారాజా , మరో వైపు హరోం హర సినిమాలతో పోటీపడి మంచి కలెక్షన్లను రాబడుతుంది. దానితో ఈ సినిమా హిట్ స్టేటస్ కి చాలా దగ్గరగా వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. 11 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించింది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 11 రోజుల్లో నైజాం ఏరియాలో 3.49 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 82 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 3.56 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 12 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.78 కోట్ల షేర్ ... 14.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 9 రోజుల్లో 56 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.07 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 9 రోజుల్లో 9.41 కోట్ల షేర్ ... 18.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 59 లక్షల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు ఊపు చూస్తూ ఉంటే మరో రెండు, మూడు రోజుల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకునేలా కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: