నో డైలాగ్..ఓన్లీ యాక్షన్.. గా దూసుకెళ్తున్న "మిస్టర్ బచ్చన్" షో రీల్..!!

murali krishna
హరీష్ శంకర్   రవితేజ  
కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది, జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ లో హిట్ అయిన అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి షో రీల్ అని ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసారు.
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ బచ్చన్' కోసం కలిశారు. షోరీల్ వీడియోని రిలీజ్ చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ షోరీల్‌ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఎలాంటి డైలాగ్‌లు లేవు. షోరీల్ ని కంప్లీట్ యంగేజింగ్ గా కట్ చేశారు హరీష్ శంకర్. రవితేజ స్టైలిష్, మాస్ క్యారెక్టర్‌లో పరిచయం కాగా, జగపతి బాబు విలన్ గా కనిపించాడు. రవితేజ గెటప్ క్లాస్‌గా ఉంది, అతని యాక్షన్ ఎక్కువగా మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. రవితేజ అమితాబ్ బచ్చన్‌ను ఇమిటేట్ చేసే చివరి సీన్ బాగుంది.భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరూ షోరీల్‌లో కనిపించారు. టెక్నికల్ గా.. అయనంక బోస్ అందించిన ఎక్స్ ట్రార్డినరీ కెమెరా వర్క్, మిక్కీ జె మేయర్ అందించిన స్కోర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. షోరీల్ సినిమాపై అంచ‌నాల‌ను మరింతగా పెంచింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. 

దాదాపు నిమిషం నివిడి ఉన్న ఈ వీడియోలో సింగిల్ డైలాగ్ కూడా లేకపోవడం విశేషం. ఫుల్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో రవితేజ చివరి వరకూ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. వింటేజ్ లుక్ లో స్టైల్ గా స్మోకింగ్ చేస్తూ.. అభిమానులకు కిక్కిచ్చాడు. ఓ పవర్ ఫుల్ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ఓ బడా పొలిటిషియన్ ఇంటికి రైడ్ కు వెళ్లాక.. అక్కడ ఏం జరిగింది అన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించినట్లు సమాచారం.ఇక ఈ మూవీలో ఫ్యాన్స్ రవితేజను ఎలా చూడాలనుకున్నారో అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ చూపించాడు. ఇక భాగ్యశ్రీ బోర్సే తన అందాలతో మెస్మరైజ్ చేసింది. ఇలా సింగిల్ డైలాగ్ లేకుండా వీడియోను రిలీజ్ చేయడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ప్రజెంట్ ఈ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తూ.. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఇక ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందించగా.. కెమెరామెన్ గా అయనంక బోస్ పనిచేశాడు. ప్రముఖ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: