"మహారాజా" మరో "బిచ్చగాడు" కానుందా.. 4 రోజుల్లో అలాంటి రిపోర్ట్..?

Pulgam Srinivas
తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే సైరా నరసింహా రెడ్డి, ఉప్పెన అనే రెండు తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు మహారాజా అనే తమిళ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ జూన్ 14 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.

ఇక కొంత కాలం క్రితం తమిళ సినిమా అయినటువంటి బిచ్చగాడు తెలుగులో విడుదల అయ్యి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే మహారాజా సినిమా కూడా బిచ్చగాడు రేంజ్ ఇంపాక్ట్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
4 రోజుల్లో ఈ సినిమాకి నైజాం ఏరియాలో 1.62 కోట్లు కలెక్షన్లు దక్కగా, సీడెడ్ లో 56 లక్షలు , ఆంధ్రాలో 1.26 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 4 రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 3.46 కోట్ల షేర్ , 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మరో 4 లక్షల షేర్ కలక్షన్లను రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: