సినిమా ఫ్లాప్ అయితే చరణ్ ఏం చేస్తాడో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ అనేది చాలా సర్వసాధారణమైన విషయం. ఒక సినిమాతో భారీ హిట్ అందితే మరొక సినిమాతో పెద్ద అపజయం దక్కి అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది నటులు హిట్ వచ్చినప్పుడు చాలా ఆనంద పడిపోయి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అదే ఒక వేళ ప్లాప్ వచ్చినట్లు అయితే బాధపడుతూ ఉంటారు. కానీ మరి కొంత మంది మాత్రం హిట్, ఫ్లాప్ రెండిటిని ఒకే రకంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో ఆయన నటించిన సినిమా కనుక ఫ్లాప్ అయితే ఏం చేస్తాడు అనే దానిని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ నటించిన సినిమా కనుక ఫ్లాప్ అయినట్లు అయితే బాధపడుతూ ఉండకుండా రిలాక్స్ అవడం కోసం పార్టీ చేసుకుంటూ ఉంటాడట. సినిమా కనుక అద్భుతమైన విజయం సాధిస్తే ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తాడో సినిమా కనుక ఫ్లాప్ అయినట్లు అయినా కూడా పార్టీ చేసుకుంటూ అదే స్థాయిలో చరణ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడట. ఇకపోతే రామ్ చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తర్వాత చరణ్ "ఉప్పెన" మూవీతో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ అనంతరం సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే చరణ్, సుకుమార్ కాంబోలో రంగస్థలం మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ కాంబో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతో మంది లవ్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: