కూతురు లవ్ స్టొరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన అర్జున్... అది నేను ముందే ఊహించా...అర్జున్..!

MADDIBOINA AJAY KUMAR
తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించిన అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం కొన్ని రోజుల క్రితమే ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అర్జున్ కుమార్తె ఐశ్వర్య తమిళ నటుడు తంబి రామయ్య ఉమపతి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని అర్జున్ తాను నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎంతో వైభవంగా నిర్వహించాడు. దీనికి ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు.

ఇక ఐశ్వర్య, ఉమాపతి ల ప్రేమ వ్యవహారం గురించి నాకు ముందే తెలుసు అని చెబుతూనే అందుకు సంబంధించిన చాలా విషయాలను అర్జున్ తాజాగా చెప్పుకొచ్చాడు. అర్జున్ తాజాగా మాట్లాడుతూ... ఒకసారి ఉమాపతి నేను హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. ఆ కార్యక్రమంలో ఆయనను చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ సమయంలోనే నా కూతురికి, ఉమాపతికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక ఒకానొక సమయంలో నా కూతురు నాతో పర్సనల్ గా ఒక విషయం చెప్పాలి అని అంది.

అప్పుడే నాకు అర్థం అయింది అదేదో ప్రేమ విషయం అయి ఉంటుంది అని. అన్నట్లుగానే ఆమె తంబి రామయ్య ఉమాపతిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. నా కూతురు తన ప్రేమ విషయం గురించి నాకు చెప్పడంతో నేను నిర్మించిన హనుమాన్ ఆలయంలోనే మేము వారి పెళ్లి గురించి మాట్లాడి ఫిక్స్ చేశామని అర్జున్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఐశ్వర్య ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించింది. దానితో ఐశ్వర్య పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా అని అంజున్ ను యాంకర్ ప్రశ్నించగా ప్రశ్నించగా... తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలోనే తాను ఎంతో పరినితి ఉన్న అమ్మాయిలా ఆలోచించింది. సినిమాల విషయం కూడా ఆమెనే నిర్ణయం తీసుకుంటుంది అని సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: