దేవర తెలుగు రాష్ట్రాలకు బిజినెస్ ఎంతో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
జూనియర్ ఎన్టీఆర్ ఆఖరిగా ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించి ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. దీనితో ఈ సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్ కి గ్లోబల్ గా గుర్తింపు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి ఒక గొప్ప మూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపాందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాతోనే ఈమె తెలుగు తరపు పరిచయం కానుంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తుండగా, అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన రెండు తెలుగు రాష్ట్రాల అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మివేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమాకు అదిరిపోయే సూపర్ సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారుగా 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలవాలి అంటే దాదాపు 130 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్ట వలసి ఉంటుంది. ఈ మూవీకి మంచి హిట్ టాక్ వచ్చినట్లు అయితే ఈ సినిమాపై ఉన్న బజ్ కి ఈ షేర్ కలెక్షన్లు రాబట్టడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద విషయం ఏమీ కాదు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: