పవన్ గెలుపు పై అలాంటి నిర్ణయం తీసుకున్న మాటల మాంత్రికుడు..??

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. టాలీవుడ్ లో స్టార్ హీరో. రోజుకు రెండు కోట్లు సంపాధించే స్టార్. రాజకీయల్లోకి వచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేశాడు. ఎన్నో మాటలు..అవమానాలు తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపించాడు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు.. వంద శాంతం తన అభ్యర్ధులను గెలిపించుకున్నారు పవన్.ఈ విషయంలో ఫ్యాన్స్ దిల్ ఖుషి గా ఉన్నారు.ఇక ఈక్రమంలో పవన్ కు ఆత్మియుల స్పందన కూడా అందరూ చూశారు. అందులో మరీ ముఖ్యంగా పవర్ స్టార్ వెన్నెంటే ఉండే స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ కు ఎలా విష్ చేస్తారా అని అందరికి ఆలోచన ఉంది. అయితే ఈ విషయంలో త్రివిక్రమ్ ఓ సంచలన నిర్ణయం తీసకున్నాడట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ..త్రివిక్రమ్ ఎంతో హెల్ప్ చేశారు పవన్ కళ్యాణ్ కు అన్న అన్న  విషయం కూడా మన అందరికీ తెలిసిందే . చాలా మంది వాళ్ళని విడగొట్టడానికి చూసిన సరే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడు తమ ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసుకోలేదు .టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు.

శ్రీవారి మెట్టు కాలిబాట ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఆయన.. నిన్న రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సడెన్ గా ఇలా తిరుమల శ్రీవారిని కాలినడకన వచ్చి దర్శించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మాములుగా ఆయన తన సినిమా రిలీజ్ సమయంలో కానీ, సినిమా సక్సెస్ అయ్యాక కానీ తిరుమలకు వస్తుంటాడు. కానీ ఈసారి అవేం లేకుండా రావడంతో దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎక్కవగా త్రివిక్రమ్ కి మంచి సన్నిహితుడైన పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో త్రివిక్రమ్ తిరుమల సందర్శించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.పవన్ కోసమే అయన కాలి నడకన తిరుమలకు వెళ్లారని చెబుతున్నారు. మరికొందరేమో ఆయన ఫ్యామిలీతో రావడం వవల్ల అది నిజం కాదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచినా తర్వాత మొదటి సారి త్రివిక్రమ్ ఇలా తిరుమలకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఇక త్రివిక్రమ్ ఈ ఏడాది మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ మూవీ ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సన్నద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: