ప్రభాస్ విషయంలో నాకు తగిలిన ఎదురుదెబ్బ అదే.. నిత్యామీనన్..!

lakhmi saranya
అలా మొదలైంది చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిత్యామీనన్. తన అంద చందాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. కేవలం కళ్ళతోనే హాబాభాలు పలికించి ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్, నితిన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శర్వానంద్ మరియు నాని అండ్ సూర్య నటించిన మంచి గుర్తింపును సంపాదించుకోండి. ఇక చివరిగా తిరు చిత్రంలో నటించింది. ఆ తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ వెబ్ సిరీస్ అండ్ మూవీలతో ఫుల్ బిజీగా ఉంది నిత్యామీనన్.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. అలా మొదలైంది సినిమా ప్రమోషన్స్ లో నిత్యామీనన్ ని ప్రభాస్ గురించి అడిగారు. అప్పుడు ఆమె ప్రభాస్ ఎవరో నాకు తెలీదు అని ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఈ బ్యూటీ ని దారుణంగా ట్రోల్స్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. ఇక నిత్యామీనన్ ఎక్కడికి వెళ్లినా మీడియా వాళ్ళు కూడా ఆమెని ప్రశ్నించడం మొదలుపెట్టారు. టాలీవుడ్ లో సినిమా చేస్తున్నావ్ ప్రభాస్ ఎవరో తెలియదా అని అడిగారట.
ఆమెకి బాగా పొగరు అందువల్లే ఇలా బిహేవ్ చేస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. ఈ సంఘటనతో తనకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదని నిత్యామీనన్ తెలిపింది. ఎందుకంటే నేనప్పుడూ చాలా చిన్న అమ్మాయిని.. సినిమాలు గురించి ఏమీ తెలీదు. తెలుగు సినిమాలు అసలే తెలీదు. చత్ర పరిశ్రమలో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు అవగాహన లేదు. ప్రభాస్ గురించి అడగగానే తెలీదు కాబట్టి తెలియదని చెప్పాను. దానికి ఏదో పాపం చేసినట్లు నన్ను మానసికంగా వేధించారు. అది నా జీవితంలో బలంగా తగిలిన ఎదురు దెబ్బ.. అంటూ తెలియజేసింది నిత్యామీనన్. ప్రజెంట్ నిత్యామీనన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: