వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అయిన "ఊరు పేరు భైరవకోన"..!

MADDIBOINA AJAY KUMAR
ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ కిషన్ కొంత కాలం క్రితం ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి వర్షా బొల్లమ్మ , కావ్య డాపర్ హీరోయిన్లుగా నటించగా , ఈ సినిమాకు వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ చిత్రం నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను మాత్రమే వసూలు చేసి అవరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఈ మూవీ ఓ టి టి లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ధియేటర్లతో పోలిస్తే ఓ టీ టీ లో ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెరపై సందడి చేయబోతుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాని మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యి ఓ టీ టీ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఈ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఇకపోతే సందీప్ కిషన్ ప్రస్తుతం ధనుష్ హీరోగా రూపొందుతున్న తమిళ సినిమా రాయన్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక గతంలో కూడా ధనుష్ హీరోగా రూపొందిన కెప్టెన్ మిల్లర్ మూవీ లో కూడా సందీప్ కిషన్ కీలకమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk

సంబంధిత వార్తలు: