అల్లు అర్జున్... అట్లీ కాంబో మూవీ ఆగిపోవడానికి ప్రధాన కారణం ఎమిటో తెలుసా..?

Pulgam Srinivas
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయం లోనే అల్లు అర్జున్ ప్రత్యేకంగా చెన్నై వెళ్లి మరి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ నీ కలిసిన విషయం మనకు తెలిసింది. ఇక వీరిద్దరి కాంబోలో మూవీ ఆల్మోస్ట్ సెట్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. దానితో పుష్ప పార్ట్ 2 మూవీ క్లోజ్ కాగానే అల్లు అర్జున్, అట్లీ కాంబోలో మూవీ అంటూ వార్తలు కూడా వచ్చాయి. వీరి కాంబో మూవీకి అంతా సిద్ధం అనుకున్న సమయంలోనే ఈ సినిమా క్యాన్సిల్ అయింది అని వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమా క్యాన్సిల్ కావడానికి అట్లీ నే ప్రధాన కారణం అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ సినిమా క్యాన్సల్ కావడానికి అట్లీ ప్రధాన కారణం అని ఎందుకు వార్తలొస్తున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. అట్లీ "రాజా రాణి" మూవీతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు వరుసగా విజాయలను అందుకున్నాయి. ఇక ఆఖరుగా ఈ దర్శకుడు షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా జవాన్ అనే సినిమాను రూపొందించాడు.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇలా ఈయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ కావడం, అలాగే ఈయన దర్శకత్వం వహించిన ఆఖరి మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు తన పారితోషకం గానే 100 కోట్లు డిమాండ్ చేసినట్లు, తనకే 100 కోట్లు ఇస్తే హీరో రెమ్యూనరేషన్ ఇతర ఖర్చులు అన్నీ కలిపి భారీ మొత్తంలో అవుతాయి అనే ఉద్దేశంతో నిర్మాతలు వెనకడుగు వేసినట్లు దానితో ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: