విశ్వం హిందీ రైట్స్ కి అంత క్రేజా... ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాయో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ ప్రస్తుతం విశ్వం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీచంద్ గత సినిమాలకు హిందీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. దానితో ఈయన నటించిన కొన్ని సినిమాలను హిందీలో కూడా విడుదల చేశారు. వాటిలో కొన్ని మంచి విజయాలను కూడా అక్కడ సాధించాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈయన నటించిన సినిమాలు తెలుగులోనే పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేదు. ఆ సినిమాలు హిందీ ప్రేక్షకులను కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

దానితో గోపీచంద్ నటిస్తున్న విశ్వం మూవీ కి హిందీ ప్రేక్షకుల నుండి పెద్దగా రెస్పాన్స్ రాదు అని అంతా అనుకున్నారు. కాకపోతే ఈ సినిమాకు హిందీ ఏరియాలో అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. విశ్వం మూవీ హిందీ ఏరియా థియేటర్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరి ఇటు ప్లాపుల్లో ఉన్న హీరో , అటు ఫ్లాప్ లలో ఉన్న దర్శకుడు వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమాకు ఇంత స్థాయిలో హిందీ ఏరియాలో బిజినెస్ జరగడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు.

మరి హిందీ ఏరియాలో ఈ సినిమా ఈ స్థాయి బిజినెస్ ను జరుపుకుంది కానీ, ఈ స్థాయి కంటే ఎక్కువ కలెక్షన్లను రాబడుతుందా అనేదే ప్రశ్నర్ధకంగా మారింది. ఇక గోపీచంద్ మాత్రమే కాకుండా శ్రీను వైట్ల కూడా ఈ సినిమాతో సాలిడ్ విజయాన్ని అందుకొని అదిరిపోయే కం బ్యాక్ ఇవ్వాలి అనే కసితో ఉన్నారు. ఈ చిత్రంలో కావ్య తాప‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, చేత‌న్ భ‌రద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టిజి విశ్వ‌ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: