షాకింగ్ : విజయ్ సేతుపతి కాళ్ళు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్?

praveen
కోలీవుడ్ మక్కల్ సల్వన్ విజయ్ సేతుపతి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన నటనతో ఇప్పటికే అందరికీ సుపరిచితుడుగా మారిపోయారు ఆయన. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూనే ఏకంగా విభిన్నమైన క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా చేస్తూ ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఏకంగా హీరోలను ఢీకొట్టే విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ఎంతోమంది అభిమానులను మెప్పించడంలో సక్సెస్ అవుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

 ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటాడు విజయ్ సేతుపతి   అందుకే ఎంతోమంది డైరెక్టర్లు విజయ్ సేతుపతిని దృష్టిలో పెట్టుకొని.. ఎన్నో వైవిద్యమైన పాత్రలు రాసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి విజయ్ సేతుపతి తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఎందుకంటే ఆయన ప్రధాని పాత్రలో నటించిన మహారాజ అనే సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది  ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి.

 కాగా ఇటీవల ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఎయిర్పోర్టులో విజయ్ సేతుపతి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు ఏకంగా విజయసేతుపతి కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు బుచ్చిబాబు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన మూవీలో అటు విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం బుచ్చిబాబు కారణంగానే ఉప్పెన సినిమా ఒప్పుకున్నాను అంటూ విజయ్ సేతుపతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశాడు. అయితే ఇటీవల ఎయిర్పోర్టులో ఏకంగా బుచ్చిబాబు అటు విజయ్ సేతుపతి కాళ్లు మొక్కడం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: