కూతురిపై కొండత ప్రేమ.. అర్జున్ సర్జా అల్లుడికి కట్నంగా ఏం ఇచ్చాడంటే?

praveen
కూతురు అంటే తండ్రికి ఎప్పటికీ ప్రేమే. ఎంతమంది కొడుకులు ఉన్నా ఇక కూతురుని మాత్రం అల్లారుముద్దుగా చూసుకుంటాడు తండ్రి. కొడుకుల విషయంలో కాస్త గంభీరంగా ఉండే తండ్రి.. కూతురు దగ్గర మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతూ ఉంటాడు.  అందుకే తండ్రి కూతుర్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది. అందుకే ఈ కూతురికి పెళ్లి చేసినప్పుడు తన తాహతకు మంచి కట్నకానుకలు పెట్టాలని ప్రతి తండ్రి ఆశ పడుతూ ఉంటాడు. అలాంటిది ఏకంగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి కూతురు పెళ్లి జరిగితే.. కట్నకానుకలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు.

 ఇక ఇలా స్టార్ హీరోలకు సంబంధించిన కూతుర్ల పెళ్లి పేరంటాలు లాంటి ఏదైనా కార్యక్రమం జరిగితే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. కాగా యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురు ఐశ్వర్య వివాహం జరిపించాడు. కమెడియన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతితో గ్రాండ్గా పెళ్లి జరిగింది. అయితే కూతురు అంటే కొండంత ప్రేమ ఉన్న హీరో అర్జున్ ఏకంగా తన కూతురికి భారీగానే కట్న కానుకలు సమర్పించుకున్నాడట. జూన్ 10వ తేదీన అర్జున్ కూతురు ఐశ్వర్య ను ఉమాపతికి ఇచ్చి వివాహం జరిపించాడు. చెన్నైలో ఉన్న అంజన సుత శ్రీ యోగాంజనేయ స్వామి మందిరంలో మీ పెళ్లి వేడుక జరిగింది.

 ఇక ఈ వివాహ మహోత్సవానికి ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక పెళ్లి కంటే గ్రాండ్గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే అర్జున్ తన అల్లుడికి ఎంత కట్నం ఇచ్చాడు అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఏకంగా కూతురు మీద  ప్రేమ ఉండడం కారణంగా అర్జున్ ఏకంగా తన కూతురికి 150 కోట్ల రూపాయల కట్నం ఇచ్చాడు అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా విలువైన విలాసవంతమైన బంగ్లాను కూడా బహుమతిగా ఇచ్చేసాడట. ఇక చెన్నైలో అటు అర్జున్ కు చాలా స్థలాలు ఉన్నాయని. అందులో కొన్ని ఏకంగా తన పెద్ద కూతురుకు రాసిచ్చాడు అంటూ చర్చ జరుగుతుంది  వాస్తవానికి అర్జున్ తన కూతురికి ఎంత కట్నం ఇచ్చాడు అన్న విషయం ఎవరికీ అధికారికంగా తెలియకపోయినా.. ఇక ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అర్జున్ కు ఎవరు వారసులు లేకపోవడంతో ఇలా భారీగానే పెద్ద కూతురు ఐశ్వర్య కు కట్నం ఇచ్చేశాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: