జాన్వి కపూర్ కి ఆ అకౌంట్ లేదు జాగ్రత్త... టీమ్..!

Pulgam Srinivas
శ్రీదేవి , బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వి కపూర్ ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును బాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది . ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోం ది . మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి . ఈ మూవీ విడుదల కాక ముందే ఈ బ్యూటీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు సనా దర్శకత్వం లో రూపొందబోయే సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపిక అయింది.

ఇలా ఈనటి వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . ఇకపోతే తాజాగా జాన్వి కపూర్ టీం తనకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని జనాలకు చెప్పుకొచ్చింది . తాజాగా జాన్వి టీం... జాన్వి కపూర్ కి ఇప్పటివరకు ట్విట్టర్ అకౌంట్ లేదు. కాకపోతే తన పేరుతో ఎంతో మంది ట్విట్టర్ అకౌంట్ లను క్రియేట్ చేశారు. అలాగే బ్లూ సింబల్స్ ను కూడా తీసుకున్నారు. అవి నిజంగా జాన్వి వి అని కొంత మంది అనుకుంటున్నారు.

అలా అనుకోవడం వల్ల మోసం జరిగే అవకాశం ఉంది. అందువల్లనే తెలియజేస్తున్నాం. అవి జాన్వి అకౌంట్ లు కావు. దయచేసి ఆ అకౌంట్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. వాటి నుండి ఎలాంటి మెసేజ్ లు వచ్చిన పట్టించుకోకండి అని తన టీం చెప్పుకొచ్చింది. ఇకపోతే జాన్వి కపూర్ ఇన్ స్టా గ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు అందులో తన ఫోటోలను పోస్ట్ చేయడం మాత్రమే కాకుండా తన అభిమానులతో ఈ మాధ్యమం ద్వారా ముచ్చటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: