రష్మిక పారితోషికం విషయంలో అస్సలు తగ్గడంలేదుగా?

Suma Kallamadi
మన సౌత్ హీరోయిన్ల సంగతి అందరికీ తెలిసినదే. మొదట ఇక్కడ బాగా పేరు తెచ్చుకొని ఆ తరువాత బాలీవుడ్లో జెండా పాతాలని అక్కడి దర్శక నిర్మాతల వెంట పడుతూ ఉంటారు. ఇది దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నదే. విజయ శాంతి నుంచి పూజా హెగ్డే వరకూ ఎందరో కథానాయికలు అక్కడ తమ ప్రతాపం చూపించాలని ట్రై చేసినవారే. అయితే సక్సెసైన వాళ్ళు మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఈ కోవకే చెందింది మన రౌడీ హీరోయిన్ రష్మిక మందన. దాదాపు రెండేళ్ల క్రితం 2022లో అమితాబ్ బచ్చన్ గుడ్ బై ద్వారా నార్త్ లో తెరంగేట్రం చేసిన రష్మికకు చేదు అనుభవం మిగిలింది. అయినా సరే నిరాశపడకుండా సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో మూగమ్మాయిగా నటించింది. ఆ సినిమా ఓటిటి రిలీజైనా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. దాంతో మరలా ఆమెకి నిరాశ తప్పలేదు.
ఇక గత డిసెంబర్ నెలలో వచ్చిన యానిమల్ సినిమా మాత్రం ఆమెకి ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. రన్ బీర్ కపూర్ వయొలెంట్ యాక్టింగ్ కి ధీటుగా రష్మిక చేసిన యాక్టింగ్ బాలీవుడ్ యువతకి బాగా నచ్చేసింది. దాంతో అక్కడ ఆమెకి మంచి ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా యాక్షన్ మూవీ ‘సికందర్’ సినిమాలో ఆమె కధానాయికగా చేస్తోంది. దీని రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుకానుంది. ఇక బాలీవుడ్ టాక్ ప్రకారం ఈ ప్యాన్ ఇండియా మూవీకి రష్మికకు 13 కోట్ల దాకా పారితోషికం ముట్టజెప్పారట. ఇప్పటిదాకా తన కెరీర్ లో ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది.
ఎందుకంటే కేవలం 4 నుంచి 7 కోట్ల మధ్యలో తీసుకుంటున్న శ్రీవల్లికి ఇది భారీ మొత్తం అనే చెప్పుకొని తీరాలి. ప్రస్తుతం ఆమె పుష్ప 2 ది రూల్, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ తో తెలుగులో చేస్తున్న రష్మిక మందన్న హిందీలో విక్కీ కౌశల్ తో చావా అనే చారిత్రాత్మక సినిమా కూడా చేస్తోంది. ఈ లిస్టులో ప్రతిదీ క్రేజ్ ఉన్న ప్రాజెక్టు కావడంతో ప్రస్తుతం అమ్మడికి మంచి డిమాండ్ ఉంది. ఎంత డిమాండ్ అంటే ఇప్పటికిప్పుడు ఆమె డేట్లు కావాలన్నా దొరికే పరిస్థితి లేదు. ఇకపోతే జూలై  నెలలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న సికందర్ లో ఆమెకి క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని వినికిడి. దానికోసం రష్మిక ట్రైనింగ్ తీసుకోనుందని సమాచారం. అమ్మడికి ఆల్ ది బెస్ట్ చెబుదామా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: