"పుష్ప 2" పోస్ట్ పోన్... ఈ దెబ్బతో క్లారిటీ వచ్చేసిందిగా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ లో హీరో గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మలయాళ నటుడు పహాడ్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో సమంత ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ తెరకెక్కుతుంది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కావడం కష్టమే అని ఈ మూవీ పోస్ట్ పోన్ కానుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తలపై చిత్ర బృందం మాత్రం స్పందించలేదు.

ఇకపోతే ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఈస్మార్ట్ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనితో పుష్ప పార్ట్ 2 ఆగస్టు 15 వ తేదీన విడుదల కావడం లేదు అని తెలియడం తోనే డబల్ ఈస్మార్ట్ మేకర్స్ ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే డబల్ ఈస్మార్ట్ మూవీ లో కావ్య దాపర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: