మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్.. పుష్ప 2 కు దెబ్బ తప్పదు అంటున్న డైరెక్టర్..!

lakhmi saranya
ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి అండ్ అల్లు అర్జున్ మధ్య వారు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే ఘటన ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో మెగా ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ ప్రముఖులు మొత్తం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ అల్లు అర్జున్ మాత్రం 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ కు కాకుండా తన వైఫ్ ఫ్రెండ్ భర్త నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేశాడు. అంతేకాకుండా అతడి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ నేరుగా తన మద్దతు ప్రకటించారు.
ఇక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు, చిరంజీవి, చరణ్తో పాటు మెగా ఫ్యామిలీ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సాయి ధరంతేజ్ ఇటీవల ట్విట్టర్ అండ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. ఇక నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై చురకలు అంటించే విధంగా పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైరం అల్లు అర్జున్ తదుపరి చిత్రం పుష్ప 2 పై ప్రభావం చూపిస్తుందని సంచలన కామెంట్స్ చేశాడు దర్శకుడు గీతాకృష్ణ. ఆయన మాట్లాడుతూ.." అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ కావచ్చు.
కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమాలు అండ్ రాజకీయాల్లో బచ్చ. ప్లాన్డ్‌ దా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ కావడం పుష్ప తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అలాగే గతంలో ఎవరికీ దక్కని నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అల్లు అరవింద్ కు పవన్ కళ్యాణ్ కు కొన్ని అనివర్ణ కారణాల చేత పడదు. కాబట్టే పవన్ అంటే అల్లు అర్జున్ కు కూడా నచ్చదు. అది మొన్న బయటపడింది. కానీ పవన్ కళ్యాణ్ తో వివాదం అల్లు అర్జున్ అప్కమింగ్ మూవీ పుష్ప 2 పై పడుతుంది. పదేళ్లగా పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కష్టపడుతుంటే ఎప్పుడో పబ్ లో పరిచయమైన రవి కోసం ఎగేసుకొని వెళ్ళాడు. పవన్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతాడని అల్లు అర్జున్ ఊహించలేదు. అల్లు అర్జున్ ఇప్పటికైనా మెగా ఫ్యామిలీతో తరిస్తే మంచిది " అంటూ కామెంట్స్ చేశాడు గీతాకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: