విజయ్ ఫ్యాన్స్ కి షాక్.. పేరు మార్చుకున్న రౌడీ హీరో..!?

Anilkumar
అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారి సెన్సేషన్ సృష్టించిన నటుడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా సూపర్‌ హిట్ అందుకోవటామే కాదు జాతీయ స్థాయి క్రేజ్‌ సంపాదించుకున్నాడు విజయ్‌. తరువాత గీత గోవిందం సినిమా కూడా ఘన విజయం సాధించటంతో విజయ్‌ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. అదే జోరులో అయితే వరుసగా నోటా, డియర్‌ కామ్రేడ్ సినిమాలు ఫెయిల్ కావటంతో ఇప్పుడు తన కెరీర్‌ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. గీతగోవిందం’ తరువాత విజయ్ దేవరకొండకి సరైన హిట్టు పడలేదు. 

గత ఏడాది ‘ఖుషి’ వంటి లవ్ రొమాంటిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్నారు అంతే. దీంతో ఈసారి ఎలాగైనా ఒక పెద్ద హిట్టు కొట్టడం కోసం.. విజయ్ మళ్ళీ గీతగోవిందం దర్శకుడు పరుశురాంనే నమ్ముకున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు కానీ బ్లాక్ బస్టర్ గా మాత్రం ఈ సినిమా నిల్వ లేకపోయింది. దీంతో ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో అయినా ఎలాగైనా హిట్ కొట్టాలి అని సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారి సెన్సేషన్ సృష్టించిన   విజయ్ దేవరకొండకు

 సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. విజయ్ దేవరకొండ తన పేరు మార్చుకోవాలని ఫిక్స్ అయ్యాడట. పేరు మార్చుకోమని విజయ్ మదర్ సలహా ఇచ్చారట. అంతేకాదు పేరు ఎలా మార్చుకోవాలన్నది కూడా ఆమె దగ్గర ఉండి చూస్తున్నారట. విజయ్ దేవరకొండ అనేది యూత్ ఆడియన్స్ లో ఒక బ్రాండ్ గా ఏర్పడింది. అలాంటి బ్రాండ్ పేరులో మార్పులు అంటే విజయ్ ఫ్యాన్స్ షాక్ అవ్వక తప్పదు. విజయ్ దేవరకొండ నిజంగానే పేరు మార్చుకుంటున్నాడా.. రౌడీ స్టార్ కూడా ఇలాంటివి నమ్ముతాడా లాంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: