మంచు విష్ణు 'కన్నప్ప' టీజర్ వచ్చేసింది.. ప్రభాస్ ఎంట్రీ చూసారా..!?మంచు విష్ణు 'కన్నప్ప' టీజర్ వచ్చేసింది.. ప్రభాస్ ఎంట్రీ చూసారా..!?

Anilkumar
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు  మొదట్లో పలు సినిమాలు చేసి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత వరుస ఫ్లాప్ లను అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాతో అయినా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అందుకోవాలి అని ఇప్పుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆవా

 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కి సంబంధించిన మంచి విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్  మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఇక విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్ నుండి దీనిపై అంచనాలు భారీ స్థాయిలో చేరుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాంతో పాటు ఇందులో చాలామంది పాన్ ఇండియా స్టార్స్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఇప్పటికే సోషల్ మీడియా అవేదికగా పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం

 చేస్తున్నారు. మరి ఇందులో ఏ స్టార్స్ ఉన్నారు ఏంటి అన్న విషయాన్నికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు చేయలేదు.. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేశారు మేకర్స్.. కన్నప్ప సినిమాలో శివుడు కచ్చితంగా ఉంటాడని తెలిసిందే. దీంతో కన్నప్పాలో ప్రభాస్ శివుడుగ అనటిస్తున్నడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా చూపించిన టీజర్ ప్రకారం అక్షయ్ కుమార్ శివుడిగా నటించినట్టు తెలుస్తుంది. అలాగే టీజర్ లో ప్రభాస్ కళ్ళని చూపిస్తూ ఓ షాట్ వేశారు. ఇక కన్నప్పని ఓ వీరుడిగా ఆచూపిస్తు యుద్ధ సన్నివేశాలతో టీజర్ ని అదరగొట్టేశారని తెలుస్తుంది.. మొత్తానికైతే టీజర్ తో అదరగొట్టేసాడు మంచు విష్ణు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: